లోకేష్ పాదయాత్రకు వైపీసీ ఎమ్మెల్యేల మద్దతు
1 min read
నారా లోకేష్ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలను మార్చివేస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన ఈ నెల 13న నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలకడానికి నెల్లూరు తెలుగు తమ్ముళ్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో వైపీసీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముగ్గురు కూడా నారా లోకేష్ కు మద్దతు ప్రకటించడానికి సిద్ధమౌతున్నారు. వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నారా లోకేష్ కు జై కొట్టనున్నారు. ఆనం ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో సమావేశమయ్యారు. నెల్లూరు టీడీపీ నేతలు కూడా ఆనంతో పాటు కోటంరెడ్డిని కలిసి సన్నాహాక ఏర్పాట్లపైన చర్చించారు. మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నేరుగా నారా లోకేష్ ను కలిసి తన సంఘీభావం తెలిపారు.