రవిప్రకాష్ కు జరిమానా
1 min readప్రముఖ జర్నలిస్టు రవిప్రకాష్ కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఎదురుదెబ్బ తగిలింది. టీవీ9 పైన ఆయన చేసిన ఫిర్యాదు మీద ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేస్తు 10 లక్షల రూపాయల జరిమానా విధించింది. టీవీ9కు చెందిన ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ వాటాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, సంస్థను స్వాధీనం చేసుకున్నవారిని నియంత్రించాలని కోరుతూ ఛానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ ,కె.వి.ఎన్.మూర్తిలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన వాాదనలు విన్న ట్రిబ్యునల్ రవిప్రకాష్ ఫిర్యాదును కొట్టివేసింది. రవిప్రకాష్ కు తెలిసే అన్ని ప్రక్రియలు జరిగాయని, ఉద్దేశపూర్వకంగా ఆయన తప్పుదోవపట్టించారని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. ఆయన చర్య అనైతికమంటు జరిమానా విధించింది. టీవీ9 యాజమాన్య బాధ్యతలు తనకు వస్తాయని ఇంత కాలం నమ్మకంతో ఉన్న రవిప్రకాష్ కు ఇది పెద్ద ఎదురుదెబ్బ.