రాహుల్ గాంధీని కలిసిన నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి , పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా రాహుల్ తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా నవీన్ యాదవ్ ను రాహుల్ అభినందించారు. ఉప ఎన్నికలు జరిగిన తీరు , తాజా రాజకీయ పరిణామాలపైన నేతలు రాహుల్ తో చర్చించారు.

