ముగిసిన కొండా సురేఖ,నాగార్జున వివాదం

మంత్రి కొండా సురేఖ , సినీ హీరో నాగార్జున మధ్య నెలకొన్న వివాదం ముగిసింది. కొండా సురేఖ పైన దాఖలు చేసిన క్రిమినల్ దావా పిటిషన్ ను నాగార్జున ఉపసంహరించుకున్నారు. నాంపల్లి కోర్టులో ప్రస్తుతం ఈ పిటిషన్ పైన విచారణ జరుగుతోంది. తాజాగా నాగార్జున కుటుంబానికి క్షమాపణ తెలియజేస్తు కొండా సురేఖ ఎక్స్ వేదికగా క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యల పట్ల బాధపడి ఉంటే చింతిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో నాగార్జున తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. దీంతో వీరి మధ్య నెలకొన్న వివాదం సామరస్యంగా ముగిసినట్లైంది.
నాగార్జున కుటుంబం పైన మంత్రి కొండా సురేఖ గాంధీభవిన్ లో మీడియాతో మాట్లాడుతు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీని పైన నాగార్జున తో పాటు సినిమా పరిశ్రమ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే నాగార్జున మంత్రి కొండా సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే కోర్టు ఇరు వర్గాల నుంచి వాంగ్మూలం తీసుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో వివాదానికి తెరపడింది.
