తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల కు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి 13న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ మేరకు అన్నీ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పరిధిలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. మొత్తం 56 లక్షల మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు.
