సబ్ స్టేషన్ లో ఎంపి కోమటిరెడ్డి
1 min read ఉచిత విద్యుత్ పైన అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన అధికార పక్షం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగితే ఆ పార్టీకి కాంగ్రెస్ కౌంటర్ కార్యక్రమాలు చేసింది. మరో వైపు 24 గంటల విద్యుత్ పైన కాంగ్రెస్ నేతలు తమ ఎదురుదాడిని కొనసాగిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా ఓ సబ్ స్టేషన్ ను సందర్శించి కరెంటు కోతల వ్యవహారాన్ని బయటపెట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బండ సోమవారం సబ్ స్టేషన్ కు వెళ్లిన కోమటిరెడ్డి లాగ్ బుక్ లో రైతులకు అందుతున్న ఉచిత కరెంట్ వివరాలను పరిశీలించాడు. 10, 11 గంటలకు మించి రైతులకు కరెంట్ అందడం లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదని ఆయన ధ్వజమెత్తారు.