సోనియాను కలిసిన కోమటిరెడ్డి
1 min read
భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. లోక్ సభలో ఆమెతో కోమటిరెడ్డి కొద్దిసేపు ముచ్చటించారు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొడుకు వివాహ ఆహ్వాన పత్రికను సోనియాకు ఆయన అందజేశారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు,ఇతర అంశాలను కోమటిరెడ్డి ఆమె వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఇటీవలె కోమటిరెడ్డి వరిదీక్షలో పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాలను పక్కన పెట్టడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. కోమటిరెడ్డి ,రేవంత్ రెడ్డి ఒక తాటిపైకి రావడంతో పార్టీ నాయకులు ఆనందంగా ఉన్నారు.