డిఎస్ కు గాయం
1 min read
రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ప్రమాదవశాత్తు గాయపడ్డారు . హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పూజ గది నుంచి బయటకు వస్తు జారిపడ్డారు. దీంతో ఆయన భుజం దగ్గర విరిగింది. దీంతో డిఎస్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చేయికి కట్టు కట్టారు. రెండు మూడు రోజుల్లో ఆపరేషన్ నిర్వహించనున్నారు. డిఎస్ గాయపడిన విషయాన్ని ఆయన కుమారుడు, నిజామామాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.