ఛార్మినార్ లో కవిత భోగి
1 min readగ్రేటర్ లో చావుతప్పి కన్నులొట్టబోయిన తర్వాత టీఆర్ఎస్ తన రాజకీయ వ్యూహాలను మార్చుకుంటోంది.ఎంఐఎంతో స్నేహాం ఇబ్బందికరంగా మారడంతో ఆ చట్రం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ కవిత చార్మినార్ దగ్గర ప్రత్యక్షమయ్యారు. అక్కడ బోగి పండుగను నిర్వహించారు. ఛార్మినార్ భాగ్యలక్ష్మి టెంపులో కవిత ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక హోటల్ లో ఇరానీ ఛాయ్ ఎంజాయ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి టెంపుల్ కేంద్ర బిందువు అయిన నేపథ్యంలో కవిత పర్యటన చర్చనీయాంశంగా మారింది.