కోమటిరెడ్డి..కాంగ్రెస్ ను వదిలి పో .. సీతక్క
1 min read ములుగు ఎమ్మెల్యే సీతక్క భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపైన విరుచుకుపడ్డారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకు పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి కోవర్ట్ ఆవరేషన్ సిగ్గుమాలిన చర్య అని సీతక్క నిప్పులు చెరిగారు. హైకమాండ్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నిబద్దత కల్గిన రాజకీయాలు చేయాలనుకుంటే పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోమటిరెడ్డికి సూచించారు. బంధాలకు అతీతంగా పాలిటిక్స్ ఉండాలని ఆమె స్పష్టం చేశారు. తమ్ముడి గెలుపు ముఖ్యమైతే వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కండువా వదిలేయాలని సీతక్క తేల్చి చెప్పారు. మునుగోడులో కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కోమటిరెడ్డి అన్నీ వదిలేసి ఆస్ట్రేలియా ఎలా పోతారని సీతక్క ప్రశ్నించారు.