హరీష్ రావు కాదు కలెక్షన్ రావు

ఎల్లంపల్లి ప్రాజెక్టు ను బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టిందన్న హరీష్ రావు వ్యాఖ్యలపైన చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విరుచుకుపడ్డారు. ఎల్లంపల్లి కి కేసీఆర్ కు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎల్లంపల్లికి శంకుస్థాపన చేశారని సత్యం వివరించారు. 2014 లోనే ప్రాజెక్టు పూర్తి అయినప్పటికి కాంగ్రెస్ కు పేరు వస్తుందన్న భయంతో అధికారికంగా ప్రారంభించలేదని ఆయన ధ్వజమెత్తారు. కాళేశ్వరం చేపట్టిన తర్వాత ఎల్లంపల్లిని అందులో అంతర్భాగం చేశారని సత్యం వివరించారు. హరీష్ రావు కలెక్షన్ రావు అని కవితనే విమర్శిస్తోందని, ముందు ఆమె కు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.