కోమటిరెడ్డి విరాళం కోటీ
1 min read
అయోధ్య రామమందిర్ నిర్మాణం కోసం తెలుగు రాష్ట్రాల్లో విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.సామాన్య ప్రజలు, వ్యాపారులు, రాజకీయ నాయకులు భారీ చందాలు ప్రకటిస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రామమందిర నిర్మాణం కోసం కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన బీజేపీలో చేరతానని ఇప్పటికే ప్రకటించారు. మరో వైపు బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జితేందర్ రెడ్డి కూడా రామమందిరం కోసం కోటి రూపాయల విరాళం ఇచ్చారు. మెగా సంస్థ ఆరు కోట్లు, మైహోం సంస్థ ఐదు కోట్ల రూపాయలను రామ్ మందిర్ కు ఇవ్వనున్నట్లు ప్రకటించాయి.