జగ్గారెడ్డి కార్యకర్తల సమావేశం

1 min read

తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎపిసోడ్ కు ఇంకా శుభం కార్డు పడలేదు. వారం రోజుల నుంచి మౌనంగా ఉన్న ఆయన సంగారెడ్డిలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తు కార్యచరణపైన జగ్గారెడ్డి కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకోనున్నారు.  ఈ నెల 25న సంగారెడ్డి మల్కాపూర్ చౌరస్తా వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ లో ఉండాలా లేదా అన్న అంశంపైన ఈ సమావేశంలో అభిప్రాయాలను తీసుకుంటానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తనపైన పార్టీలో కోవర్టు అనే ముద్ర వేశారంటు వారం రోజుల క్రితం జగ్గారెడ్డి  తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేస్తానని ప్రకటించడంతో కలకలం మొదలైంది. అయితే పార్టీ సీనియర్ నాయకులు రంగప్రవేశం చేసి ఆయనను బుజ్జగించారు. సోనియా, రాహుల్ గాంధీతో సమావేశం ఏర్పాటు చేస్తామన్న హామీతో జగ్గారెడ్డి శాంతించారు. రాజీనామాకు 15 రోజుల సమయం తీసుకుంటానని చెప్పిన ఆయన గడువు ముగియకముందే కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn