దానం నాగేందర్ వర్సెస్ రంగనాథ్
1 min readహైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కబ్జాల పైన ఉక్కుపాదం మోపుతున్నారు.చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. రాజకీయంగా ఎంత ఒత్తిడి వచ్చినప్పటికి రంగనాథ్ వెనక్కి తగ్గడం లేదు. చెరువులో కట్టిన భవనం కూల్చివేత ను అడ్డుకున్న మజ్లిస్ ఎమ్మెల్యే ను హైడ్రా టీం అదుపులోకి తీసుకుంది. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. నందగిరి హిల్స్ హుడా లేఔట్ గోడ కూల్చడానికి ప్రయత్నించారంటు దానంతో పాటు మరికొందరిపై హైడ్రా కేసు పెట్టింది. దీనిపై దానం నాగేందర్ మండిపడుతున్నారు. ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని, చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని నాగేందర్ స్పష్టం చేశారు.