బి.ఆర్.ఎస్ పాలనలోనే నీటి సంక్షోభం
1 min read
తెలంగాణా రాష్ట్రంలో నీటి సంక్షోభానికి బి.ఆర్.ఎస్ ప్రభుత్వమే కారణమని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.కృష్ణా జలాలను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకు పోవడం గత పాలకులు అవలంబించిన ఉదాసీనతయో కారణమని ఆయన మండిపడ్డారు.బుధవారం గాంధీభవన్ లో మీడియా ప్రతినిధు లతో ఆయన మాట్లాడారు.కృష్ణా జలాశయాల అంశంలో తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం రూపొందించిన నియమావళిని సరి దిద్దిందన్నారు.చేసినంత చేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై మాజీమంత్రి హరీశ్ రావు ఆరోపణలు చేయడం అర్ధరహితమని,ఆయన ఆరోపణలు పూర్తిగా అసత్యమని ఆయన పేర్కొన్నారు.సరైన పద్దతిలో నీరు అందించింనందునే ఖరీఫ్ సీజన్‌లో సమైక్యాంధ్రలో కుడా సాధ్యం కాని ధాన్యం దిగుబడి ప్రస్తుత ప్రభుత్వంలో తెలంగాణా రాష్ట్రం సాదించిందన్నారు.రబీ పంటకు సాగు నీరు అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు.అయితే, కృష్ణా మరియు గోదావరి నదుల జలాల విషయంలో మునుపటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్వాహక లోపంతో ప్రస్తుతం రైతులకు తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తోందని ఆయన ఆరోపించారుగోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నీటి సంక్షోభానికి బీఆర్‌ఎస్ కారణమని, తుమ్మిడిహట్టి ప్రాజెక్టును నిర్మించడంలో విఫలమైన బీఆర్‌ఎస్ వైఫల్యం తెలంగాణకు ఒక పెద్ద నష్టంగా పరిణమించిందని ఆయన విమర్శించారుమేడి గడ్డ వద్ద భద్రతా చర్యలు తీసుకోకపోతే, మొత్తం గ్రామాలు మునిగిపోవచ్చని నెషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.ఇప్పటికయినా
హరీష్ రావు తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం మానేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి హితవుపలికారు.