పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌

1 min read

పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌

ఐదు వందల మందికి ఒక సర్వేయర్

31వ తేదీ నాటికి ప‌రిశీల‌న‌ పూర్తి చేయాలి

సామాజిక స‌ర్వేకు తుదిగ‌డువు 13వ తేదీ

14వ తేదీన సంక్షేమ హాస్ట‌ల్ విద్యార్ధుల‌తో స‌హ‌పంక్తి భోజ‌నం

15,16 తేదీల్లో జ‌రిగే గ్రూప్ -2 ప‌రీక్ష‌ల‌కు విస్తృత ఏర్పాట్లు

కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ ,హౌసింగ్‌. స‌మాచార శాఖ మంత్రి  పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌ను పకడ్బందీగా చేప‌ట్టాలని రెవెన్యూ ,హౌసింగ్‌. స‌మాచార శాఖ మంత్రి  పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న , గ్రూప్ -2 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, మెస్ ఛార్జీల‌పెంపు, సామాజిక స‌ర్వే త‌దిత‌ర అంశాల‌పై బుధవారం సచివాలయం నుంచి ముఖ్యమంత్రి సలహా దారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ ” ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజా పాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల ప‌రిశీల‌న‌ను ఈనెల 31వ‌తేదీ లోగా పూర్తిచేయాలి. ప‌రిశీల‌న చేసిన స‌ర్వే వివ‌రాల‌ను మొబైల్ యాప్‌లో నమోదు చేయాలి, ప్రతి ఐదు వందల మందికి ఒక ఉద్యోగి ( సర్వేయ‌ర్‌) ను నియమించుకోవాలి. సర్వే లో ఇందిరమ్మ కమిటీ సభ్యులను కూడా భాగ‌స్వామ్యం చేయాలి, రాష్ట్రంలో ఎక్కడైనా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాక పోతే వెంటనే ఏర్పాటు చేసుకోవాలి, ఏ గ్రామంలో సర్వే నిర్వహిస్తారో ఆ ముందు రోజు రాత్రి గ్రామంలో చాటింపు చేయాలి. అంతేగాక‌ స్థానిక పరిస్థితులను బట్టి క‌లెక్ట‌ర్‌లు ప్రణాళికలు రూపొందించుకోవాలి, ఏ ఒక్క దరఖాస్తును విడిచిపెట్ట‌కుండా చిన్న చిన్న పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా పకడ్బందీగా సర్వే నిర్వహించాలి, సర్వే వివరాలపై ప్రతి రోజు కలెక్టర్ లు సమీక్షించాలి, ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు, సలహాలకోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలి, ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం ఓ నిరంత‌ర ప్ర‌క్రియ ఈ ఏడాది 4.5 ల‌క్ష‌ల ఇండ్ల‌ను నిర్మించ‌బోతున్నాం “కలెక్టర్ లకు మంత్రి సూచించారు.

గ‌త ప్ర‌భుత్వం ప‌ది సంవ‌త్స‌రాల‌లో ప్ర‌భుత్వ వ‌స‌తి గృహాల‌లో చ‌దువుకొనే విద్యార్ధుల మెస్ ఛార్జీల‌ను ఒక్క‌సారి కూడాపెంచ‌లేదు. మా ప్ర‌భుత్వం ఏడాది లోపే 40 శాతం మెస్ ఛార్జీలు పెంచుతూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యం వ‌ల్ల 7.65 ల‌క్ష‌ల మంది విద్యార్దుల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగింది. క‌లెక్ట‌ర్లు త‌ర‌చూ హాస్టళ్ల‌ను త‌నిఖీ చేసి విద్యార్ధుల‌కు అందించే స‌రుకుల క్వాలిటీ, క్వాంటిటీపై ప్ర‌ధానంగా దృష్టి సారించాలి. ఈనెల 14వ తేదీన మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ,పార్ల‌మెంటు స‌భ్యులు స్ధానికంగా ఉన్న సంక్షేమ హాస్ట‌ళ్ల‌ను సంద‌ర్శించి అక్క‌డే విద్యార్ధుల‌తో క‌లిసి స‌హ‌పంక్తి భోజ‌నం చేస్తాం. ఈకార్య‌క్ర‌మంలో విద్యార్ధుల త‌ల్లిదండ్రులు కూడా పాల్గొనాలి.

సామాజిక స‌ర్వే
రాష్ట్రంలో 1కోటీ 16 ల‌క్ష‌ల కుటుంబాల‌కు గాను 1కోటీ 12 ల‌క్ష‌ల కుటుంబాల సామాజిక స‌ర్వే (99.09 శాతం) పూర్తిచేయ‌డం జ‌రిగింది. ఇందుకు కృషి చేసిన అధికారుల‌కు ముఖ్య‌మంత్రి గారి త‌ర‌పున‌, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ప్ర‌త్యేక అభినంద‌న‌లు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. ఈనెల 13వ తేదీ సామాజిక స‌ర్వేకు తుదిగ‌డువు. ఆ త‌ర్వాత ప్ర‌జా పాల‌న సేవా కేంద్రాల‌లో కూడా కుటుంబ స‌ర్వే వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవ‌చ్చు.ఈనెల 15, 16 తేదీల‌లో జ‌రిగే గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn