నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పిన మంత్రి కొండా సురేఖ

మంత్రి కొండా సురేఖ సినీనటుడు నాగార్జున కు క్షమాపణ చెప్పారు. ఆయన పైన చేసిన వ్యాఖ్యలపైన పశ్చాత్తాపం చెందుతున్నట్లు ఆయన ఎక్స్ లో వివరించారు. ఆయన కుటుంబాన్ని కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని కొండా సురేఖ తెలిపారు. నాగార్జున కుటుంబం తన వ్యాఖ్యలకు బాధపడి ఉంటే క్షమాపణ తెలియజేస్తున్నట్లు ఆమె అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.
మంత్రి కొండా సురేఖ గతంలో నాగార్జున కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య , సుమంత విడాకుల అంశంపైన కొన్ని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపైన తీవ్ర ఆగ్రహనికి గురైన నాగార్జున కుటుంబం ఆమెపైన నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసింది. దీనిపైన ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటు ప్రకటన విడుదల చేశారు. దీనిపైన నాగార్జున ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

