ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డి

1 min read

* ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ ,రామ్మోహన్ నాయుడుని కలిసిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ ఎంపీలు,అధికారులు రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

* రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు జాతీయ రహదారుల మంజూరీ, రీజినల్ రింగ్ రోడ్డు పై నితిన్ గడ్కరీతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

* కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

* మంత్రితో పాటు ఆర్ & బీ శాఖ స్పెషల్ ఛీఫ్, సెక్రెటరీ, స్పెషల్ సెక్రటరీ, ఎన్.హెచ్. ఉన్నతాధికారుల బృందం.

* మొదటి నితిన్ గడ్కరితో సమావేశమైన మంత్రి.. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న వివిధ రహదారులు, రీజినల్ రింగ్ రోడ్డుపై విన్నవించారు.

* రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం లభించేలా చూడాలని కోరిన మంత్రి

* రెండు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పూర్వపనులు పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చూస్తామని హామీ ఇచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

* (1) రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణం,
* (2) శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ (NH-765),
* (3) పర్వత్ మాల పథకం క్రింద 5 రోప్ వే ప్రాజెక్టుల మంజూరీ,
* (4) సిఆర్ఐఎఫ్ సేతుబంధు పథకం క్రింద 12 ప్రాజెక్టుల మంజూరీ,
* (5) NH 65 లోని హైదరాబాద్-విజయవాడ విభాగం 6 లేనింగ్ మరియు NH 163 లోని హైదరాబాద్ – మన్నెగూడ విభాగం 4 లేనింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేడం వంటి 5 ప్రధాన అంశాలతో కూడిన అభ్యర్ధలను నితిన్ గడ్కరీకి అందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

1. రీజినల్ రింగ్ రోడ్డు (RRR)

* రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణ స్థితిగతులను నితిన్ గడ్కరీకి వివరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

RRR ఉత్తర భాగం :

* 27.12.2024 రోజున రూ. 7,100 కోట్లతో 5 ప్యాకేజీలుగా పిలిచిన ఉత్తర భాగం టెండర్ల తేదీలను 14.02.205 నుంచి 20.03.2025 కి పొడగించిన విషయంపై చర్చించిన మంత్రి.

* ఉత్తర భాగానికి సంబంధించి PPPAC (Public Private Partnership Appraisal Committee)& కేబినెట్ ఆమోదంపై గడ్కరీని కోరిన మంత్రి

* ఆర్థిక త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం మరియు అటవీ అనుమతులను వేగవంతం చేయాలని అభ్యర్ధించిన మంత్రి.

* RRR దక్షిణ భాగం :

* చౌటుప్పల్ (NH 65 పై) – అమంగల్ – షాద్‌నగర్ – సంగారెడ్డి (NH 65 పై) మీదుగా నిర్మిస్తున్న RRR దక్షిణ భాగం యొక్క అలైన్ మెంట్ ను ఫైనలైజ్ ప్రకటన చేస్తూ.. ఆమోదం తెలుపవలసిందిగా కోరిన మంత్రి.

——-

2. హైదరాబాద్-శ్రీశైలం (NH-765) ఎలివేటెడెట్ కారిడార్

* హైదరాబాద్-శ్రీశైలం (NH-765) 187 కిలోమీటర్ల రహదారిలో 62 కిలోమీటర్ల ఎలివేటెడెట్ కారిడార్ నిర్మాణంపై గడ్కరీని కోరిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

* శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ మార్గంలో 62 కిలోమీటర్లు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ గుండా వెళుతుండటంతో.. అటవీ అనుమతుల కారణంగా అభివృద్ధి జరగలేదని వివరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

* ⁠దక్షిణ కాశీగా, 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం కేంద్రప్రభుత్వం హైదరాబాద్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ను ప్రతిపాదించిన విషయాన్ని గడ్కరీకి గుర్తు చేసిన మంత్రి.

* ఇదే విషయమై 27.06.2024 రోజున సర్వే పూర్తి చేసి రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ మోర్త్ కు సమర్పించడం.

* మోర్త్ (MoRTH – Ministry of Road Transport and Highways) సూచనల మేరకు టైగర్ రిజర్వ్ అధికారుల అనుమతి కూడా కోరడం. 28.10.2024 తేదిన అరణ్య భవన్ లో సమావేశం.

* అనంతరం మోర్త్ సూచనల ప్రకారం 17.12.2024 నాడు అటవీ అనుమతుల కోసం PARIVESH-2.0లో దరఖాస్తు చేయడం తదుపరి పురోగతిపై గడ్కరీకి వివరించిన మంత్రి.

* వీటన్నింటి దృష్ట్యా శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్‌ ప్రగతిలో ఆలస్యం జరగకుండా వేగంగా అనుమతులు మంజూరు చేయాలని కోరిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సోమశిల కేబుల్ బ్రిడ్జి టెండర్లు పిలిచెందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించించినట్లు తెలిపిన మంత్రి.
———————

3.పర్వత్ మాల పథకం కింద్ర 5 రోప్ వే ప్రాజెక్టుల మంజూరీకై వినతి

* కేంద్ర ప్రభుత్వం పర్యాటక ప్రదేశాలకు రోప్‌వే కనెక్టివిటీ అభివృద్ధి కోసం పర్వతమాల పథకాన్ని ప్రవేశపెట్టిందని.. అయితే, ఈ పథకంలో తెలంగాణకు ఇప్పటి వరకు ఎటువంటి ప్రాజెక్టులు మంజూరు కాలేదని నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

* పర్యాటక ప్రదేశాలకు మెరుగైన కనెక్టివిటీ, సౌకర్యాన్ని అందించేందుకు (1) యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి (2 కి.మీ) రోప్‌వే, (2) భువనగిరి కోటకు (1 కి.మీ) రోప్‌వే, (3) నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండ (2 కి.మీ) రోప్‌వే, (4) నాగార్జునసాగర్ ఆనకట్ట మీదుగా (5 కి.మీ) నాగార్జునకొండను కలుపుతూ రోప్‌వే. (5) మంథనిలోని రామగిరి కోట (2 కి.మీ) రోప్‌వే వంటి 5 రోప్ వే ప్రాజెక్టులను తెలంగాణకు మంజూరీ చేయాలని కోరిన మంత్రి.
———————–

4.CRIF-సేతుబంధన్ పథకం క్రింద 12 ప్రాజెక్టుల మంజూరీకై వినతి

* CRIF-సేతుబంధు పథకం క్రింద రూ. 887.45 కోట్ల విలువైన 12 రహదారి పనులను మంజూరీ చేయాలని కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు రాసిన లేఖ (26.06.2024) విషయాన్ని నితిన్ గడ్కరీకి గుర్తు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

* ఇప్పటికి ఆ అభ్యర్ధనలు పెండింగ్ లో ఉండటంతో తాను మరో అభ్యర్ధన లేఖను నితిన్ గడ్కరీకి లేఖను అందించిన మంత్రి.

* *2023-24 ఆర్థిక సంవత్సరంలో సేతుబంధన్ పథకం కింద ప్రతిపాదిత 12 పనులను మంజూరు చేయాలని కోరిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
——————-

5.హైదరాబాద్-విజయవాడ NH 65 ను 6 లేన్లుగా విస్తరణకై వినతి

* రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య కీలకమైన NH-65పై ట్రాఫిక్ 40,000 ప్యాసింజర్ కార్ యూనిట్ గా ఉండటం వలన అనేక ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా NH-65 ని 6 లేన్లుగా విస్తరించాలని నితిన్ గడ్కరీకి వివరించిన మంత్రి.

* NH-65ని (హైదరాబాద్-విజయవాడ) 6 లేన్లుగా నిర్మించేందుకు ఉద్దేశించిన DPR తయారీని వేగవంతం చేయడంతో పాటు ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరిన మంత్రి.

* అంతేకాదు, NH-163 లోని హైదరాబాద్ నుండి మన్నెగూడ రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని భేటి సందర్భంగా కోరిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

———————-

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

* మామునూరు ఎయిర్ పోర్ట్ మంజూరీపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి

* భూసేకరణకు 205 కోట్ల రూపాయలను మంజూరీ చేసి భూసేకరణ చేస్తున్న విషయం రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

* వీలైనంత త్వరగా మామునూర్ ఎయిర్ పోర్టును పూర్తి చేసేలా చూస్తానని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి

* దశాబ్ధ కాలంగా పెండింగ్ లో ఉన్న ఎయిర్ పోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కృషితోనే కార్యా రూపం దాల్చింది.

* మామునూరు ఎయిర్ పోర్టు కు భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు

* మామునూరు ఎయిర్ పోర్టు కోసం జిఎంఆర్ నుంచి NOC తీసుకున్నాం

* రెండున్నరేళ్లలో మామునూర్ ఎయిర్ పోర్టు పూర్తి చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు

* మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యర్ధనకు స్పందించిన రామ్మోహన్ నాయుడు.. త్వరలోనే భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించిన IMD సర్వే పూర్తి చేసి ఫీజిబిలిటీ స్టడీ చేస్తామని హామీ ఇచ్చారు.

* ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టులకు సర్వే చేయనున్న ఎయిర్ పోర్ట్ అథారిటీ.

* మామునూర్ ఎయిర్ పోర్టు కి 15 రోజుల్లో భూసేకరణ పూర్తవుతుంది.

* మంత్రితో పాటు ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి,నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ కుందూర్ రఘువీర్ రెడ్డితో పాటు ఆర్ అండ్ బీ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ శ్రీమతి దాసరి హరిచందన ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn