రాజాసింగ్ అందుకే కలిశాడు.. మంత్రి హరీష్ రావు

1 min read

తన నియోజకవర్గంలోని ప్రభుత్వాస్పత్రి సమస్యల కోసమే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనను కలిశారని మంత్రి హరీష్ రావు తేల్చి చెప్పారు. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరులు తమ పార్టీ నేత దాసోజ్ శ్రవణ్ ను బెదిరిస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఉచిత విద్యుత్ అంశాన్ని పక్కదారి పట్టించడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణం అనడం పెద్ద జోక్ అన్నారు. విద్యుత్ ఉద్యమం నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టిందని ఆయన స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ పైన చేసిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిందని హరీష్ రావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn