సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మీనాక్షి నటరాజన్

సీఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఆయన సతీమణి గీత ఆమెను సాదరంగా ఆహ్వానించారు. మీనాక్షి నటరాజన్ వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో వీరి భేటీ కి ప్రాధాన్యత ఏర్పడింది.