ఘనంగా మనోజ్, భూమా మౌనికా రెడ్డి పెళ్లి
1 min read
మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి వివాహం ఘనంగా జరిగింది. ఫిలింనగర్ లోని మంచు లక్ష్మీ నివాసంలో సన్నిహితుల మధ్య ఈ ఇద్దరు ఒకటయ్యారు. మనోజ్, మౌనికాల పెళ్లికి ఇరు కుటుంబాల వారు హాజరయ్యారు. వీరిద్దరికి ఇది రెండో వివాహం కావడం విశేషం. భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనికా రెడ్డి. మౌనికకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. మనోజ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. చాలా కాలం నుంచి వీరిద్దరి పెళ్లిపైన ప్రచారం జరుగుతోంది.