మహారాష్ట్ర మహిళా కానిస్టేబుల్ బ్యాక్ ఫ్యాకెట్ లంచం
మహారాష్ట్ర ట్రాఫిక్ మహిళా పోలీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అయింది. ఆమె లంచం తీసుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నిబంధనలు అతిక్రమించిన వాళ్ల దగ్గర నుంచి ట్రాఫిక్ పోలీస్ లు ఎంతో కొంత లంచం వసూలు చేయడం దేశంలో సర్వసాధారణమే. నిజాయితీ కల్గిన అధికారులు చలాన్ లు వేసి వదిలేస్తారు. కాని లంచాలకు అలవాటు పడ్డ పోలీస్ లు మాత్రం ఏదో ఒక రూపంలో డబ్బులు వసూలు చేసి జేబులో వేసుకుంటారు. మహారాష్ట్రలో ఒక మహిళా కానిస్టేబుల్ మాత్రం డైరెక్టుగా లంచం తీసుకునేందుకు మోహమాటపడ్డారు. అందరు చూస్తుండగా చేయి చాపితే బాగుండని అనుకుందేమో ఇన్ డైరెక్టుగా లంచం లాగించేసింది. హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్న మహిళ దగ్గర నుంచి ఆమె లంచం డిమాండ్ చేసింది. ఆమె కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడింది. అయితే డైరెక్టుగా తీసుకోకుండా బ్యాక్ ప్యాకెట్ పెట్టాలని కానిస్టేబుల్ ఆమెకు సూచించింది. కానిస్టేబుల్ వెనక్కి తిరగగానే ఆమె బ్యాక్ ఫ్యాకెట్ లో నోట్లు పెట్టేసింది. అయితే ఈ వ్యవహారాన్ని అంతా పై నుంచి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియలో వదిలారు. ఈ వెరైటీ లంచం ఇప్పుడు దేశమంతా హల్చల్ చేస్తోంది.