మధుయాష్కి గౌడ్ కు అస్వస్థత

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ కు అస్వస్థత కు గురయ్యారు. ఛాతి నొప్పి రావడంతో ఆయన స్పృహ కోల్పోయారు. మంత్రి శ్రీధర్ బాబును కలవడం కోసం సచివాలయంలోని ఆయన పేషీ కి వచ్చిన మధు యాష్కీ అక్కడే కళ్లు తిరిగి కిందపడ్డారు. దీంతో సెక్రటేరియట్ లో ఉన్న ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.