మాచర్లలో మళ్ళీ ఫ్యాక్షన్ హత్య
1 min readరాజకీయ పగలకు నిలయంగా మారిన మాచర్ల నియోజకవర్గంలో మరో సారి హత్య జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రయ్యను వైసీపీ నేతలు పట్టపగలు చంపేశారు. గుండ్లపాడు తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు, మాజీ సర్పంచ్ తోట చంద్రయ్య ను అందరూ చూస్తుండగానే గ్రామంలోనే హత్య చేశారు. గుండ్లపాడు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న గ్రామం. చంద్రయ్య హత్యను టీడీపీ అధినేత తీవ్రంగా ఖండించారు. కుటుంబసభ్యులను పరామర్శించడానికి ఆయన స్వయంగా మాచర్లకు వెళ్లారు.