ఆగిన వెన్నెలకంటి కలం

ప్రముఖ సినీ గేయ రచయిత వెన్నెలకంటి గుండెపోటుతో చెన్నైలో మరణించారు. తెలుగులో ఆయన 2వేల పాటలను రాశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినిమా పరిశ్రమలో పని చేస్తున్నారు. ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్.నటుడు ప్రభాకర్ రెడ్డి ప్రోత్సాహంతో వెన్నెలకంటి సినిమా రంగంలోకి ప్రవేశించారు.