ఎంపి మహ్మద్ ఫైజల్ కు ఊరట
1 min readలక్షదీప్ ఎంపి మహ్మద్ ఫైజల్ కు ఉరట లభించింది . ఆయనపైన విధించిన అనర్హత వేటును లోక్ సభ స్పీకర్ ఎత్తివేశారు. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఓ కేసులో ఫైజల్ కు పదేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయనను అనర్హుడిగా ప్రకటించారు. అయితే కింద కోర్టు విధించిన శిక్షపైన హైకోర్టు స్టే విధించింది. అయినప్పటికి లోక్ సభ ఆయనపైన అనర్హతను కొనసాగించింది. దీనిపైన ఫైజల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ కేసుపైన వాదనలు వినడానికి ముందే లోక్ సభ ఫైజల్ సభ్యత్వాన్ని పునరుద్దరిస్తు నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీపైన లోక్ సభ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఫైజల్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.