కేటీఆర్ కు కరోనా

ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కరోనా బారిన పడుతోంది. స్వయంగా సి.ఎం చంద్రశేఖర్ రావుకే కరోనా రాగా తాజాగా ఆయన కుమారుడు ,రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు కూడా నిర్దారణ అయింది. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు కేటీఆర్ స్వయంగా తన సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇంట్లోనే ఐసోలేషనల్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కరోనా టెస్టు చేయించుకోవాలని కేటీఆర్ సూచించారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కూడా ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రిలో టెస్టులకు వచ్చినప్పుడు కేటీఆర్, సంతోష్ ఆయన వెంట ఉన్నారు. సి.ఎంతో సన్నిహితంగా మెలగడం వల్లనే వీరిద్దరికి కరోనా వచ్చినట్లు అనుమానిస్తున్నారు.