18న సి.ఎంగా కేటీఆర్
1 min readతెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఖాయంగా కనిపిస్తోంది. సి.ఎం కేసీఆర్ తన సీటును వదులుకోవడానికి సిద్ధమైనట్లు బలమైన సంకేతాలు వస్తున్నాయి. తన కుమారుడు, మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టడానికి దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు,ఎమ్మెల్యేలు వరసగా చేస్తున్న కామెంట్లు దీనికి బలాన్ని ఇస్తున్నాయి. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేమిటని మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను బలపరుస్తు అనేక మంది పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. తాజాాగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఏకంగా కేటీఆర్ కు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ పాల్గొన్న సభలో ఆయన బహిరంగంగానే కాబోయే సి.ఎంకు శుభాకాంక్షలు వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నవారంతా కరతాళధ్వనులు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక తమ సమస్యలను పట్టించుకోవాలని ఆయన అన్నారు. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలపైన స్పందించలేదు. మౌనంగా ఉండటం విశేషం. మరో వైపు ఈ నెల 18న కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది.