ఫ్లీజ్.. నన్ను అరెస్ట్ చేయండి
1 min readీ
తెలంగాణలో ఇప్పుడు అరెస్ట్ రాజకీయాలు నడుస్తున్నాయి. కమాన్ నన్ను అరెస్ట్ చేయండి అంటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెగ హడావిడి చేస్తున్నాడు. దమ్ముంటే నన్ను జైలుకు పంపించండి అని ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాడు. ఏదో ఒక కేసులో త్వరగా నన్ను అరెస్ట్ చేయండి అని ఒక రకంగా ప్రాధేయ పడుతున్నారు. జైలు కు వెళ్లాలని ఆయన తెగ ఆరాటపడుతున్నాడు. ఆయన ను అరెస్ట్ చేస్తారని బీఆర్ఎస్ నాయకులు కూడా కేటీఆర్ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. పోలీసులు తీసుకెళ్లకుండా అడ్డుకుంటామని డైలాగ్ లు కొడుతున్నారు. అయితే తెలంగాణ పోలీసులు మాత్రం కేటీఆర్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అయితే కేటీఆర్ ఎందుకు తన అరెస్టు గురించి రోజు మాట్లాడుతున్నారనే డౌట్ ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో కలుగుతోంది. ఎవరి పైనైనా కేసులు పెడితే అరెస్ట్ కాకుండా కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారు. లేకుంటే న్యాయపోరాటం చేస్తారు. కాని కేటీఆర్ మాత్రం వాటి ప్రస్తావన తీసుకు రాకుండా జైలుకు వెళ్తానని అంటున్నారు. ప్రస్తుతం ఫార్ములా ఈ రేస్ వ్యవహారం లో కేటీఆర్ ను విచారించడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ కు ఎసీబీ అధికారులు లేఖ రాశారు. ఒక వేళ గవర్నర్ అనుమతి ఇస్తే కేటీఆర్ విచారించి ఒక వేళ ఆయన పాత్ర ఉందని తేలితే అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాని ఇప్పటి వరకు కేటీఆర్ ను విచారించడానికి గవర్నర్ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. ఈ కేసు విషయంలో బీజేపీ పెద్దల సహకారం కోసమే కేటీఆర్ తాజాగా ఢిల్లీ వెళ్లి వచ్చారనే విమర్శలున్నాయి. ఒక వైపు కేసు నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తు మరో వైపు తనను అరెస్ట్ చేయాలని తారక రామారావు గంభీరమైన ప్రకటనలు ఇస్తున్నారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఇదే సమయంలో లగుచర్లలో కలెక్టర్ పైన దాడి కేసులో కూడా కేటీఆర్ హస్తముందనే ఆరోపణలున్నాయి. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి తో కేటీఆర్ ఫోన్లో మాట్లాడరని, ఆయన సూచనల మేరకే దాడి జరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో తనని అరెస్ట్ చేయడం ఖాయమని కేటీఆర్ నమ్ముతున్నారు. అందుకే రైతుల కోసం జైలు కు వెళ్లడానికి సిద్ధమని ఆయన మీడియా లో ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఆ విషయాన్ని తేల్చడం లేదు.
ఏదో విధంగా అరెస్ట్ కావాలని కేటీఆర్ తెగ ఆరాటపడుతున్నారు. అరెస్ట్ కావడం వల్ల సానుభూతి సంపాదించాలన్నది ఆయన ప్లాన్ గా బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. జైలు కు పోతే అటెన్షన్ అంతా తన వైపే వస్తుందని కేటీఆర్ లెక్కలు వేసుకుంటున్నారు. పదేళ్లలో తమపై ఉన్న వ్యతిరేకత పూర్తిగా పోవడంతో పాటు సానుభూతి ఏర్పడుతుందన్నది ఆయన వ్యూహాం. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ను పెంచవచ్చునని కేటీఆర్ లెక్కలు వేసుకుంటున్నారు. మరో వైపు జైలు కు పోయివస్తే ముఖ్యమంత్రి కావొచ్చునని కేటీఆర్ భావిస్తున్నారట. గతంలో వైఎస్ జగన్, చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి లాంటి నాయకులు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారని కేటీఆర్ నమ్ముతున్నారట. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా హరీష్ రావు ను పూర్తిగా సైడ్ చేసే అవకాశం తన జైలు జీవితం వల్ల వస్తుందని తారక రామారావు భావిస్తున్నట్లు సమాచారం. ఒక్క సారి జైలు.. అనేక ప్రయోజనాలు అన్న నినాదాన్ని కేటీఆర్ బలంగా నమ్ముతున్నారు. అందుకే కమాన్ అరెస్ట్ మీ అంటు సినిమా డైలాగ్ లు కొడుతున్నారనే కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
https://youtube.com/live/ADeelDEaoN8