అలిగిన కోమటిరెడ్డి

1 min read

తెలంగాణ కాంగ్రెస్ లో నాయకుల ఐక్యత పైకి కనిస్తున్నా వాళ్లు మనసులు మాత్రం కలవడం లేదు. సమావేశాల్లో ఒక వేదిక మీద కూర్చుటున్నప్పటికి ఒకరి పొడ మరికొకరికి గిట్టడం లేదు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైన సీనియర్ నేతలు తన అసూయను చూపిస్తూనే ఉన్నారు. తమ కంటే జూనియర్ అయిన రేవంత్ పార్టీ అధ్యక్షుడు కావడాన్ని జీర్ణించుకొని పలువురు నేతలు ఈ వైఖరీని కొనసాగిస్తున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని పైకి చెపుతున్నప్పటికి పీసీపీ మీద పరోక్షంగా కోపాన్ని చూపిస్తూనే ఉన్నారు. రాహుల్ గాంధీ తో మీటింగ్ తర్వాత ఐక్యత గా ఉంటామని మీడియా ముందు చెప్పుకొచ్చిన నేతలు ఆచరణలో మాత్రం చూపించడం లేదు. ప్రధానంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైన నల్గొండ జిల్లా సీనియర్ నాయకులు అంటరానితనాన్ని పాటిస్తున్నారు. ఎంపిలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ వరంగల్ బహిరంగ సభ కోసం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు వెళ్లి నాయకులను సమాయత్తం చేశారు. ఈ క్రమంలోనే నల్గొండకు కూడా వెళ్తానని ప్రకటించారు. అయితే రేవంత్ రెడ్డి టూర్ కు కోమటిరెడ్డి, ఉత్తమ్ మోకాలడ్డారు. తమ నియోజకవర్గాలకు రేవంత్ రెడ్డి రాకను వారు అంగీకరించలేదు. దీంతో ఆయన సీనియర్ నేత జానారెడ్డి నియోజకవర్గం నాగార్జున సాగర్ లో సన్నాహాక సభ పెట్టుకోవాల్సి వచ్చింది. మరో వైపు యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో తాజాగా జరిగిన ఓ ఘటన రేవంత్ రెడ్డిపైన కోమటిరెడ్డికి ఎంత అసహనం ఉందో తెలియజేస్తుంది. సైదాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయం ప్రారంభోత్సవం కోసం అక్కడి స్థానిక నేతలు ఎంపి కోమటిరెడ్డిని ఆహ్వానించారు. అదే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పిలిచారు. కార్యక్రమానికి చామల వచ్చిన విషయం తెలుసుకొని కోమటిరెడ్డి స్థానిక నేతలపైన తీవ్రంగా విరుచుకుపడ్డాడరట. కార్యక్రమం మధ్యలోనే అక్కడి నుంచి ఎంపి వచ్చేశారు. తన నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి సన్నిహితులు కనిపించడాన్ని కోమటిరెడ్డి జీర్ణించుకోలేకపోయినట్లు సమాచారం.

స్టార్ క్యాంపైయినర్ గా ఎంపి కోమటిరెడ్డికి అధిష్టానం పదవి కట్టబెట్టింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో కలిసి పనిచేయాలని సూచించింది. అయినప్పటినికి తన సామ్రాజ్యం లోకి రేవంత్ రెడ్డి కాని, ఆయన సన్నిహితులు కాని అడుగుపెట్టడానికి వీలు లేదని కోమటిరెడ్డి భావిస్తున్నారు. అయితే స్థానిక శాసనసభ ఇంఛార్జులు మాత్రం తమ నియోజకవర్గాలకు రేవంత్ రెడ్డిని తీసుకెళ్లాలని ఆరాటపడుతున్నారు. కాని కోమటిరెడ్డి వైఖరీ కారణంగా వారు ఇబ్బంది పడుతున్నారు. తన లోక్ సభ పరిధిలో తాను చెప్పిన వాళ్లకే టిక్కెట్లు వస్తాయని, తోక జాడిస్తే కట్ చేస్తానని ఆయన పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ అగ్రనేతల మధ్య ఐక్యత నేతిబీరకాయలో నెయ్యిలాగే ఉందని కార్యకర్తలు గుణుక్కుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn