ఇందిరాపార్క్ లో నిద్ర
1 min read
వరి రైతుల కోసం ఇందిరాపార్క్ లో కాంగ్రెస్ వరిదీక్ష చేస్తోంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యనాయకులు ఈ దీక్షలో పాల్గొంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్షా శిబిరంలో నిద్రపోయారు. కనీసం ఫ్యాన్ కూడా లేకుండా చలి,దోమల మధ్య పార్టీ నాయకులు పడుకున్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. వరి దీక్ష ఆదివారం ముగియనున్నది. పార్లమెంటులో తెలంగాణ రైతుల కోసం పోరాడుతామని రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.