కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్
1 min readదుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయనకు వైద్యులు చిన్నపాటి ఆపరేషన్ చేశారు. కత్తిపోటు కారణంగా దెబ్బతిన్న చిన్నపేగులోని కొంత బాగాన్ని తొలగించారు. మూడు నాలుగు రోజుల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి కోలుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు యశోదా ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి సతీమణి,కొడుకు కు కేసీఆర్ ధైర్యం చెప్పారు. మంత్రి కేటీఆర్ కూడా కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించారు.