లిక్కర్ స్కాంలో కవిత నిర్దోషి

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో కల్వకుంట్ల కవితకు భారీ ఉరట లభించింది. ఈ కేసులో ఆమెకు క్లీన్ చీట్ ఇస్తు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. సీబీఐ నమోదు చేసిన అన్నీ కేసులను కోర్టు కొట్టివేసింది. కవితతో పాటు ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులు తప్పు చేసినట్లు ఆధారాలు లేవని కోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ , మాజీ మంత్రి మనీశ్ సిసోడియా కు కూడా విముక్తి లభించింది.తీర్పు తర్వాత కేజ్రీవాల్ మీడియా ముందు కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. జీవితంలో తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలని చేశారని , ఎన్నో తప్పుడు కేసులు పెట్టారని కేజ్రీవాల్ అన్నారు.
