జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కే మద్దతు..సీఎం కి కమ్మ సంఘాల హామీ

అమీర్ పేట మైత్రి వనం సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమ్మ సంఘాలకు హామీ ఇచ్చారు. నామినేటేడ్ పోస్టుల్లో కూడా ప్రాధాన్యత ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన పలువురు కమ్మ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి తమ సమస్యలను వారి ద్రుష్టికి తీసుకెళ్లారు.
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి వారు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హామీ ఇచ్చారు.
మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్ పల్లి ఇంచార్జ్ బండి రమేశ్, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు, కమ్మ సంఘాల ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
