సొంత పార్టీ ఏర్పాటు పైన కవిత రియాక్షన్

పార్టీ ఏర్పాటుపైన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు. హరీష్ రావు , సంతోష్ రావు తో పాటు బీఆర్ఎస్ మీడియా కూడా తనని ఇబ్బంది పెడుతోందని ఆమె ధ్వజమెత్తారు. కాళేశ్వరం విషయంలోనే తనకు, హరీష్ రావుతో విభేదాలు ఉన్నాయని ఆమె అన్నారు. స్పీకర్ ఫార్మార్ లోనే తాను రాజీానామా పత్రం ఇచ్చానని కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు.శాసనమండలి ఛైర్మన్ ఎందుకు తన రాజీనామాను ఆమోదించలేదో తెలియదని ఆమె అన్నారు. అవసరమైతే మళ్లీ రాజీనామా లేఖ పంపిస్తానని ఆమె స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ద్వారా వచ్చిన పదవి కాబట్టే రాజీనామా చేసినట్లు ఆమె స్పష్టం చేవారు. గత సంవత్సరం రాజకీయ కారణాలతో బతుకమ్మను జరుపుకోలేకపోయానన్న ఆమె జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలకు హాజరు అవుతున్నాని తెలిపారు. స్వంత ఊరు నుంచి ఆహ్వానం వచ్చింది కాబట్టే చింతమడకకు బతుకమ్మ ఉత్సవాలకు వెళ్తున్నట్లు కవిత వివరించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చునని ఆమె అన్నారు.