హరీష్ రావు మోసగాడు…కవిత నిప్పులు

కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి బీఆర్ఎస్ ను అధోగతి పాలు చేస్తున్నారని కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్ ఫలితం చూశాకనైనా బీఆర్ఎస్ ప్రతిపక్షంగా సరైన పాత్ర పోషించటం లేదని గ్రహించాలని ఆమె అన్నారు.
కేటీఆర్ ఇకనైనా సోషల్ మీడియాను వదిలి ప్రజల్లోకి వెళ్లాలని కవిత సూచించారు. హరీష్ రావు పార్టీలో ఉండి మోసం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.కృష్ణార్జునులు అనుకుంటు ఒకరి జబ్బలు ఒకరు చరుచుకుంటున్నారని కేటీఆర్, హరీష్ రావు పైన కవిత నిప్పులు చెరిగారు.మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు గుప్పించారు.

ఒక్క సభ సక్సెస్ అయితే కేసీఆర్ నే మోసినట్లు ఫీలవుతున్నారని కవిత విరుచుకుపడ్డారు. కేసీఆర్ ముందు కేటీఆర్, హరీష్ రావు లు బచ్చాలని ఆమె వ్యాఖ్యానించారు. హరీష్ రావు రావు అవినీతిపైన సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం గా విఫలం అయితే తామే ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని స్పష్టం చేశారు.
