జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ నవీన్ యాదవ్ కే..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. స్థానిక నేత నవీన్ యాదవ్ ను తమ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఐఎసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి పలువురు పోటీ పడినప్పటికి నవీన్ యాదవ్ కు అవకాశం కల్పించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ కు గట్టి పట్టుంది. గతంలో ఎంఐఎం తరుపున పోటీ చేసి గణనీయమైన సంఖ్యలో ఓట్లు సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నవీన్ అప్పట్లో పార్టీ అభ్యర్థి అజారుద్దీన్ కు మద్దతు ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో ఆజారుద్దీన్ విజయం సాధించలేదు. తాజాగా ఆయనకు ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించడంతో నవీన్ యాదవ్ కు జూబ్లీహిల్స్ కు లైన్ క్లియర్ అయింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ను బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించింది. బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.