జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ ను ఆ పార్టీ ప్రకటించింది.
పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత.
బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతకే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ గతంలోనే నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండటంతో అధికారికంగా అభ్యర్థిని ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.