కాంగ్రెస్ లోకి సంజయ్.. జీవన్ రెడ్డి నారాజ్
1 min read
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో బీఆర్ఎస్ షాక్ కు గురైంది. కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడుగా పేరున్న సంజయ్ కుమార్ పార్టీ వీడుతారని ఎవరూ అంచనా వేయలేకపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత పకడ్బందీగా చర్చలు జరిపి కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. అయితే సంజయ్ చేరిక కాంగ్రెస్ లో అసంతృప్తి కి దారి తీసింది. తనకు సమాచారం ఇవ్వకుండా సంజయ్ ను చేర్చుకున్నారంటు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ఒక దశలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. పార్టీ అధిష్టానం కలుగజేసుకొని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది.