మంత్రి మల్లారెడ్డి పైన ఐటీ దాడులు

తెలంగాణలో బీజేపీ,టీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరాటం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. ఒకరిపైన మరొకరు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. రాజకీయంగా దెబ్బతీయడానికి రెండు పార్టీలు వ్యూహా,ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపైన సిట్ దూకుడు పెంచడంతో కేంద్రంలో బీజేపీ సర్కార్ అప్రమత్తమౌతోంది. సిట్ దర్యాప్తులో అనేక కీలక విషయాలు బయటకు వస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ పైన ఒత్తిడి పెంచే ప్రయత్నాలను మోదీ సర్కార్ పెంచింది. ఈడీతో పాటు ఆదాయ పన్ను శాఖ అధికారులు తెలంగాణలో టీఆర్ఎస్ మంత్రులు,ప్రజాప్రతినిధులపైన దాడులను పెంచారు. మంత్రి గంగుల కమలాకర్ గ్రానైట్ కంపెనీలపైన ఈడీ దాడులు ఇటీవలె జరగగా తాజాగా మంత్రి మల్లారెడ్డి ఆస్తులపైన ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. దాదాపు యాభై టీంలు మల్లారెడ్డి తో పాటు ఆయన తమ్ముళ్లు, కుమారుడు, అల్లుడు ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించే పనిలో ఐటీ టీంలు ఉన్నాయి.