ఆమ్ ఆద్మీ పార్టీలోకి ఇందిరా శోభన్

1 min read

షర్మిల పార్టీకి రాజీనామా చేసిన ఇందిరా శోభన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కోసం పని చేస్తానని ఇందిరా శోభన్ తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పుతానని ఆమె వ్యాఖ్యానించారు. ఇందిరా శోభన్ వైఎస్ షర్మిల పార్టీలో కీలకంగా పనిచేశారు. పార్టీలో వచ్చిన విభేదాలు నేపథ్యంలో ఆమె బయటకు వచ్చారు. కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నించినప్పటికి వీలుకాకకపోవడంతో ఆమె ఆమ్ ఆద్మీ పార్టీని ఎంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn