ఢిల్లీలో ప్రధాని మోదీ దుమ్ముదులిపిన సీఎం రేవంత్ రెడ్డి
1 min read
ఇండియా టుడే కాంక్లేవ్… 2025 లో సీఎం రేవంత్ రెడ్డి…
రాజ్ దీప్ సర్దేశాయ్: భారత రాజకీయాల్లో ఎదుగుతున్న నేత రేవంత్ రెడ్డి… దేశంలో ఉన్న ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో చిన్న వయస్కుడు.. 55 ఏళ్లు… ఆయన పార్టీలో ఎదుగుతున్న నాయకునిగా ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు..? ఆయనకు స్వాగతం పలకండి..
మిస్టర్ రేవంత్… నన్ను ఒక బీజేపీ నేత అడగమన్నారు..? మేం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వచించిన గుజరాత్ మోడల్‌ను దేశం ముందుచాం.. కాంగ్రెస్‌కు అటువంటి మోడల్ ఏమైనా ఉందా..? కాంగ్రెస్‌కు అటువంటి రాష్ట్రం మోడల్ ఏమైనా ఉందా దేశం ముందు ఉంచేందుకు..? బీజేపీకి గుజరాత్ మోడల్ ఉన్నట్లు మీకు తెలంగాణ మోడల్ ఉందా..?
రేవంత్ రెడ్డి: గుజరాత్ నమూనా కాలం చెల్లిన నమూనా (గుజరాత్ మోడల్ ఇజ్ అవుట్ డేటెడ్ మోడల్) అది టెస్ట్ మ్యాచ్ మోడల్… తెలంగాణది 20-20 నమూనా (మోడల్). తెలంగాణ నమూనానే దేశానికి నమూనా. గుజరాత్ నమూనాలో ఏవిధమైన సంక్షేమం లేదు. ఏమైనా అభివృద్ధి ఉందనుకుంటే అది మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రయత్నించిందే.. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత గుజరాత్ మార్కెటింగ్‌కు ఎవరైనా అంబాసిడర్ ఉన్నారా? లేరా? మోదీనే సొంతంగా గుజరాత్ కోసం పోరాడుతున్నారు… మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రి.. ప్రధానమంత్రి దేశంలో ఏమూలకైనా పెట్టుబడులు వస్తే వాటికి ఆయన మద్దతు ఇవ్వడం లేదు. ఎవరైనా దేశానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తే గుజరాత్‌కు వెళ్లి పెట్టుబడులు పెట్టమని చెబుతున్నారు… ఇదేం పద్ధతి..?
రాజ్‌దీప్ సర్దేశాయ్: గుజరాత్ నమూనాకు మీ తెలంగాణ నమూనాకు మధ్య తేడా ఏమిటి?
రేవంత్ రెడ్డి: నాది అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నమూనా… ఈ మూడు మా ప్రాధాన్యాంశాలు.. అహ్మదాబాద్.. హైదరాబాద్ లోని మౌలిక వసతులను పోల్చి చూడండి.. మా హైదరాబాద్‌లో ఉన్న వసతులు.. అహ్మదాబాద్‌లో ఉన్న వసతులు చూడండి. హైదరాబాద్‌తో పోటీ పడే ఔటర్ రింగు రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్‌కు ఉన్నాయా? గుజరాత్‌లో ఫార్మా, ఐటీ పెట్టుబడులు ఉన్నాయా..? గుజరాత్‌లో ఏం ఉంది? నేను అహ్మదాబాద్, ముంబయి, బెంగళూర్, ఢిల్లీతో పోటీ పడడం లేదు.. నేను న్యూయార్క్, సియోల్, టోక్యో తో పోటీపడాలనుకుంటున్నాం. మా తెలంగాణ నమూనాతో ఎవరూ పోటీ పడలేరు.
* రాజ్‌దీప్ సర్దేశాయ్… భవిష్యత్ అవసరాలకు తగిన నగరాల నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణలో అహ్మదాబాద్‌తో పోల్చుకుంటే హైదరాబాద్… గుజరాత్‌తో పోల్చుకుంటే తెలంగాణ ముందున్నాయని మీరు బహిరంగ సవాల్ విసురుతున్నారా?
* రేవంత్ రెడ్డి: అవును.. వంద శాతం.. అందుకే మేం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తున్నాం. 30 వేల ఎకరాల్లో అద్భుతమైన నగరం నిర్మించే పని ప్రారంభించాం… అయిదేళ్ల తర్వాత వచ్చి చూడండి… ప్రపంచంలో అత్యుత్తమ నగరం నిర్మించబోతున్నాం. గుజరాత్, అహ్మదాబాద్‌లో అటువంటి నగరం ఎక్కడైనా ఉందా..? కోవిడ్ సమయంలో ఔషధాలు ఎక్కడ తయారయ్యాయి. మూడో వంతు ఔషధాలు మేం సరఫరా చేశాం. భారతదేశంలోని 35 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్‌లో ఉత్పత్తి అవుతున్నాయి. ఐటీ గురించి మేం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అహ్మదాబాద్‌లో ఐటీ ఏం ఉంది.. అహ్మదాబాద్ ఐటీ, హైదరాబాద్ ఐటీ ఎగుమతులు చూడండి..
* రాజ్‌దీప్ సర్దేశాయ్..: మీరు చెప్పే హైదరాబాద్, తెలంగాణ నమూనా 2023లో ప్రారంభమైందా..? 2014లోనే దేశం ప్రయాణం ప్రారంభమైందని మోదీ చెప్పినట్లుగానే మీరు 2023లో తెలంగాణ నమూనా ప్రారంభమైందని క్లెయిమ్ చేసుకోకూడదుగా..? చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్ లు కొంత ఖ్యాతికి అర్హులు కదా? మీరు దానిని ముందుకు తీసుకుపోతున్నారు.. ప్రతి రాజకీయ నాయకుడు తమతో మొదలవుతుందని భావిస్తున్నారు..?
* రేవంత్ రెడ్డి: మీరు సగం నిజమే చెప్పారు. నేను పూర్తి వాస్తవం చెబుతా.. ఇది ఇప్పుడు ప్రారంభమైంది కాదు.. కులీ కుతుబ్ షాహీ నుంచి ప్రారంభమైంది. కులీ కుతుబ్ షా తర్వాత నిజాం సర్కార్, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం, స్వాతంత్య్రం తర్వాత మర్రి చెన్నారెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి.. అలా ఆ తర్వాత ఇప్పుడు నేను ఉన్నా… 450 ఏళ్లకుపైగా చరిత్ర తెలంగాణ, హైదరాబాద్‌కు ఉంది. చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు కట్టారా? సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రావు కట్టారా..? హైదరాబాద్‌లో ప్రముఖ కట్టడాలన్నీ 450 ఏళ్ల నుంచే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాలు మారినా ముఖ్యమంత్రులు మారినా అభివృద్ధి కొనసాగింది. మీరు హైదరాబాద్ రండి.. ప్రపంచంలోనే అత్యుత్తమైన గాజులు, ముత్యాలు చార్మినార్ వద్ద దొరుకుతాయి. ఇప్పుడు డాలర్ల మార్పిడి చేస్తున్నాం…400 ఏళ్ల క్రితమే అక్కడ నగదు మార్పిడి ఉంది… ప్రపంచంలోని ఎక్కడ నగదు (నోట్) తీసుకువచ్చినా అక్కడ మార్చుకోవచ్చు…
* ప్రీతి: మీరు ప్రధానమంత్రి మోదీ, గుజరాత్‌పై దాడి ప్రారంభించారు.. ప్రధానమంత్రి వికసిత్ భారత్ గురించి మాట్లాడుతుంటే మీరు తెలంగాణ మోడల్ గురించి చెబుతున్నారు. తెలంగాణ వన్ ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు.. ఆయనది అబద్ధం (జుమ్లా) మీది విజన్ అంటున్నారు…ఎలా..?
* రేవంత్ రెడ్డి: నేను ఎవరిది అబద్ధం (జుమ్లా) అనడం లేదు. నేను ఒక్కటే సూటిగా చెప్పాలనుకుంటున్నా.. ఎవరిపై పక్షపాతం చూపొద్దు అంటున్నా… మోదీ గిఫ్ట్ సిటీ తీసుకెళ్లారు. ఎవరైనా విదేశీయుడు గిఫ్ట్ సిటీలో పెట్టుబుడులు పెడితే లాభాలు వాళ్ల దేశానికి తీసుకెళ్లే అవకాశం ఇచ్చారు. భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఆ అవకాశం ఇవ్వలేదు.
మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రి.. అలాంటప్పుడు గిఫ్ట్ సిటీకి ఎందుకు ప్రత్యేక రాయితీలు ఇచ్చారు. నేను ఈ మీడియా ద్వారా మోదీ, బీజేపీని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్న….మీరు గిఫ్ట్ సిటీలో పెట్టుబడులు పెట్టేవారికి ఎన్నో ప్రత్యేక అవకాశాలు, రాయితీలు ఇచ్చారు.. నిబంధనలు అతిక్రమించి గిఫ్ట్ సిటీలో ప్రయోజనాలు కల్పిస్తున్నారు.. హైదరాబాద్‌కు ఎందుకు ఇవ్వరు. గిఫ్ట్ సిటీలో యూనివర్సిటీ, పరిశ్రమ ఏ పెట్టుబడి వచ్చినా లాభాలు ఆయా దేశాలకు తీసుకెళ్లే అవకాశం ఇచ్చారు.. హైదరాబాద్‌కు ఆ అవకాశం ఎందుకు ఇవ్వరు?
* ప్రీతి: మోదీతో మంచి సంబంధాలున్న మీరు ఒక్కసారిగా ఆయనతో యుద్ధం ప్రారంభించారు ఎందుకు?
* రేవంత్ రెడ్డి: మోదీతో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవు.. నేను మోదీ విధానాలతో విభేదిస్తున్నా. మోదీ దేశానికి ప్రధానమంత్రి ఆయనకు గౌరవం ఇవ్వాలి. ఆయనను కలిసి మా రాష్ట్రానికి కావల్సినవి అడగడం నా హక్కు, బాధ్యత.. ప్రజలు నాపై నమ్మకం ఉంచి ఎన్నికల్లో గెలిపించి ముఖ్యమంత్రి చేశారు..
* రాజ్‌దీప్ సర్దేశాయ్: హైదరాబాద్ భవిష్యత్ నగరంగా నిర్మిస్తామని అంటున్నారు… ఏ భవిష్యత్ నగరానికైనా పెట్టుబడులు అవసరం. మీ బడ్జెట్‌న చూస్తే రూ.3.50 లక్షల కోట్ల అప్పు ఉంది. మీరు అనేక హామీలు ఇచ్చారు. నిరుద్యోగులకు రూ.4 వేలు, రైతులు, కూలీలకు హామీలు ఇచ్చారు. మీ దగ్గర నిధులు లేనప్పుడు అవన్నీ నెరవేర్చడం సవాల్ అని మీరు అనుకోవడం లేదా..?
* రేవంత్ రెడ్డి: కేసీఆర్ సృష్టించిన భావనలో మీరు, మా ప్రజలు ఉన్నారు. తెలంగాణ అప్పులు రూ. 3.50 లక్షల కోట్లు కాదు. రూ.7 లక్షల కోట్లు. 2014లో మేం తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ.69 వేల కోట్లు. కేసీఆర్ పదేళ్ల కాలంలోనే రూ.6 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి వెళ్లారు. మా రాష్ట్రానికి ఇప్పుడు నెలకు ఉన్న ఆదాయం రూ.18,500 కోట్లు…జీతాలు,పింఛన్లకు నెలకు రూ.6,500 కోట్లు, ఈ అప్పులకు వడ్డీలకు రూ.6,500 కోట్లు నెలకు మేం కట్టాలి. మేం తిన్నా తినకపోయినా.. టీ తాగినా, తాగకపోయినా ప్రతి నెల పదో తేదీ లోపు రూ.13 వేల కోట్లు చొప్పున కట్టాలి. మిగిలిన రూ.5 వేల కోట్లు, రూ.5,500 కోట్లతో మేం అభివృద్ధి, సంక్షేమం చేపట్టాలి.
* రాజ్‌దీప్ సర్దేశాయ్: మరి మీరు గ్యారంటీలు అన్ని ఎలా చేయగలరు..?
* రేవంత్ రెడ్డి: సరైన ప్రశ్న రాజ్‌దీప్.. మీలాగే నేను కూడా రాష్ట్రానికి రూ.3.75 లక్షల కోట్ల అప్పు ఉందనుకున్నా. వచ్చే ఆదాయంతో అన్నీ చేయగలమనుకున్నా. కుర్చీలో కూర్చున్న తర్వాత అసలు విషయం బయటపడింది.
* రాజ్‌దీప్ సర్దేశాయ్: ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్యారంటీలు చేయలేమని మీరు చెబుతున్నారా..?
* రేవంత్ రెడ్డి: నేను గ్యారంటీల గురించి చెప్పడం లేదు.. నేను అప్పులకు తిరిగి చెల్లించే గ్యారంటీల గురించి చెబుతున్నా…నేను గ్యారంటీలు చేయమని చెప్పడం లేదు. మా పరుగు సాగుతోంది.. మా పరుగును సాగనివ్వండి…వేగం ఉత్తేజాన్నిస్తుంది.. కానీ చంపేస్తుంది తెలుసుగా.. (స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్) (అంతా నవ్వులు). మోదీ ఢిల్లీలో అనేక గ్యారంటీలు ఇచ్చారు.. ఎవరూ మోడీని ప్రశ్నించడం లేదు… మోదీ గ్యారంటీలకు వ్యతిరేకమైతే ఢిల్లీలో ఎందుకు గ్యారంటీలు ఇచ్చారు. మేం 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణాలను మూడు నెలల్లోపు మాఫీ చేశాం. భారతదేశంలో తొలిసారి నేను ఇంత రుణమాఫీ చేశా… ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు…
* ప్రీతి: కానీ ఈ గ్యారంటీలు సరైనవి కాదుగా…
* రేవంత్ రెడ్డి: ఇది ఒక వ్యక్తిని అడగకూడదు…దీనిపై చర్చ జరగాలి…నేను అబద్ధం చెప్పడం లేదు. వీటిపై అంతా మాట్లాడాలి. గదిలో ఒకటి మాట్లాడుతున్నారు.. బయట మరొకటి మాట్లాడుతున్నారు…
* రాజ్ దీప్ సర్దేశాయ్: దీనిపై దేశవ్యాప్త చర్చ జరగాలి అంటున్నారా…
* రేవంత్ రెడ్డి: ఒకే దేశం – ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజన, ఇతర అంశాలపై కాకుండా వీటిపై చర్చ జరగాలి. మూల ధన వ్యయంపై (క్యాపిటల్ ఎక్సెపెండేచర్) చర్చ జరగాలి. నేను నెలకు రూ.500 కోట్లు కూడా క్యాపిటల్ ఎక్సెపెండేచర్‌పై పెట్టలేకపోతున్నా. రానున్న రోజుల్లో రాష్ట్రం, దేశం ఏం కావాలి..
* రాజ్ దీప్ సర్దేశాయ్…: నియోజకవర్గాల పునర్విభజన టిక్కింగ్ టైంబాంబ్ అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ అంటున్నారు…? మీరు ఆయనతో ఏకీభవిస్తున్నారా…
* రేవంత్ రెడ్డి: మొట్ట మొదట నేనే ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఈ అంశాన్ని లేవనెత్తా. ఏం చేసినా బీజేపీకి దక్షిణాదిలో ఏం రావడం లేదు. దక్షిణాదిపై ప్రతీకారం తీర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకు నియోజకవర్గాల పునర్విభజన అనే ఆయుధాన్ని బీజేపీ ఎంచుకుంది. దక్షిణాది ప్రాతినిధ్యాన్నితగ్గించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
* రాజ్ దీప్ సర్దేశాయ్: ఇందులో ప్రతీకారం ఏముంది.. చట్ట ప్రకారం 2026 జనాభా లెక్కల అనంతరం సీట్ల సంఖ్య ఉంటుంది.. ఎక్కడ ప్రతీకారం ఉంది. ఎందుకు మీరు దీనిని దక్షిణాది.. ఉత్తరాది పోరుగా చూస్తున్నారు…?
* రేవంత్ రెడ్డి: మంచి ప్రశ్న అడిగారు. కుటుంబ నియంత్రణ చేపట్టాలని ఎవరు ఆదేశించారు. కుటుంబ నియంత్రణ వచ్చాకే మేం ఇద్దరం.. మాకు ఇద్దరం.. మేం ఇద్దరం.. మాకు ఒక్కరు నినాదాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే దక్షిణాది అమలు చేసింది. ప్రభుత్వం చెప్పింది చేస్తే మాపై ప్రతీకారం తీర్చుకుంటారా.? కుటుంబ నియంత్రణ విధానానికి ముందైన 1971 లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టండి.
* రాజ్‌దీప్ సర్దేశాయ్: ఎం.కె.స్టాలిన్ ఎక్కువ మంది పిల్లలను కనమంటున్నారు.. దానిని సమర్థిస్తున్నారా..?
* రేవంత్ రెడ్డి: అది వేరే అంశం..దానికి సమయం ఉంది…30 ఏళ్ల తర్వాత చేపట్టమనండి… అప్పుడు దక్షిణాది సత్తా ఆధారంగా సంఖ్య పెరుగుతుంది.. (నవ్వులు).. అప్పుడు మా నియోజకవర్గాలు పెరుగతాయి…
* రాజ్‌దీప్ సర్దేశాయ్: అంటే మీరు స్టాలిన్ ను సమర్థిస్తున్నారు… 30 ఏళ్ల తర్వాత చేపట్టమంటున్నారు..
* రేవంత్ రెడ్డి: ఈ దేశంలో ప్రతి రాష్ట్రానికి కొన్ని హక్కులున్నాయి.. ఇది రాష్ట్రాల సమాఖ్య.. దక్షిణాదిలో బీజేపీకి అధికారం లేదు.. ప్రాతినిధ్యం లేదు.. అందుకే ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. కొత్త కొత్త మార్గాల ద్వారా దక్షిణాదిని శిక్షించే పనులు చేయకూడదు.
* ప్రీతి: దక్షిణాది పార్టీలు తమ హిస్టీరియాను చాటుకుంటున్నాయని అమిత్ షా అంటున్నారు…?
* రేవంత్ రెడ్డి: దక్షిణాది రాష్ట్రాలే కాదు పంజాబ్ నుంచి మనీష్ తివారి ఏం చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు నష్టమే. బీమారు (బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్) రాష్ట్రాలే ఎక్కువగా లబ్ధిపొందుతున్నాయని చెబుతున్నారు..
* ప్రీతి: అమిత్ షా ప్రొరేటా ప్రకారం (సంభావ్యతా ఆధారంగా) సీట్లు పెరుగుతాయంటున్నారు…? ఎవరికి నష్టం జరగదంటున్నారు..?
* రేవంత్ రెడ్డి: నేను పూర్తిగా విశ్లేషించి చెప్పాలనుకుంటున్నా. పంజాబ్ కూడా లాస్ అవుతోంది.. బీమారు రాష్ట్రాలు లబ్ధి పొందుతాయి… ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లు ఉంటే 50 శాతం పెంచాలనుకుంటే 120 అవుతాయి. తమిళనాడులో 39 సీట్లున్నాయి. 50 శాతం చొప్పున పెంచితే 60 వస్తాయి. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాల తేడా 40 సీట్లు ఉంటే ప్రొరేటా ప్రకారం చేస్తే 60 సీట్లు తేడా వస్తాయి. ఒక్క రాష్ట్రంలోనే ఇంత తేడా ఉంటే.. మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? దక్షిణాదిలో మొత్తం 126 ఉంటే 50 శాతం ప్రకారం పెరిగితే ఇంకో 60 నుంచి 62 సీట్లు గరిష్టంగా పెరుగుతాయి. 185 సీట్లతో మావి పూర్తవుతాయి…? మీకు మంచి హృదయం ఉంటే ఎందుకు అఖిలపక్షం పెట్టడం లేదు.. ఇది ప్రభుత్వపరమైన నిర్ణయం. ఎందుకు అధికారులకు వదిలేస్తున్నారు. నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలి.
* రాజ్ దీప్: ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు అన్ని ఏకం కావాలంటారా…
* రేవంత్ రెడ్డి: దక్షిణాది రాష్ట్రాలే కాదు ఉత్తరాది రాష్ట్రాలు రావాలి.. పంజాబ్ వంటివి కలిసి రావాలి.. పంజాబ్‌లో బీజేపీకి ఏం లేదు. అందుకే వాళ్లకు అక్కడ ఏం తగ్గినా ఇబ్బంది లేదు.. వాళ్లకు ఒకట్రెండు దక్కలేదు. వాళ్లు ఒక్క పార్టీ ప్రయోజనాల కోసం చూసుకుంటున్నారు.
* రాజ్ దీప్: వాళ్లు (బీజేపీ) రాజకీయ ప్రయోజనాలు ఒకలా చూసుకుంటే కాంగ్రెస్ కుల గణన ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటుందనే విమర్శలున్నాయి… కుల గణనను చేపట్టి శాసనసభలో ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రి మీరు.. బీజేపీ దక్షిణాది.. ఉత్తరాది తేడాలు తేస్తే మీరు కుల గణనతో తేస్తున్నారు..? మీ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కుల గణన చేపడుతామంటున్నారు…
* రేవంత్ రెడ్డి: మీరు ఏ కంపెనీని చూసిన ఏడాదిలో వచ్చిన లాభాలు, నష్టాలు లావాదేవీల చిట్టా ఉంటుంది. అలాంటప్పుడు 75 ఏళ్ల ప్రజాస్వామ్యం తర్వాత ఏ కులం లెక్కలో ఎంతో తెలియకపోతే ఎలా? జనాభా లెక్కల్లో
ఎస్సీ, ఎస్టీ లెక్కలు చేస్తున్నప్పుడు బీసీ లెక్కలు ఎందుకు చేయకూడదు. మేం అందుకే జన గణనలో కుల గణన చేపట్టాలని శాసనసభలో తీర్మానం పెట్టాం..
* రాజ్‌దీప్ : ఇది దేశాన్ని కులపరంగా విభజిస్తుంది కదా.?
* రేవంత్ రెడ్డి: వాళ్ల డిమాండ్ సరైనప్పుడు ఇవ్వడంలో తప్పేం ఉంది.. రిజర్వేషన్లు ఎందుకు ఆపాలి. మేం అందుకే రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటున్నాం. బీసీలకు బీజేపీ అన్యాయం చేసిందనేది మేం చెబుతున్నాం. ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చింది. ఇప్పుడు ఓబీసీలకు ఇవ్వాలనుకుంటున్నాం. ఎలాగైనా మేం రిజర్వేషన్లు ఇస్తాం.. మండల్ కమిషన్ 29 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది.. మేం వాటిని ఇంకా పెంచాలనుకుంటున్నాం..
* రాజ్‌దీప్: బీజేపీ హిందూత్వ రాజకీయాలు చేస్తే మీరు కుల రాజకీయాలు చేస్తున్నారు.. ఒకరు హిందుత్వ పేరుతో, మరొకరు కులం పేరుతో విభజిస్తున్నారు.?
* రేవంత్ రెడ్డి: మోదీ ప్రభుత్వంలో ఎంత మంది మైనారిటీలు ఉన్నారో మీరు చెప్పండి.. స్వాతంత్య్ర ఉద్యమంలో మైనారిటీలు పాల్గొనలేదా… అమరులు కాలేదా.. ? ప్రధానమంత్రి ఎందుకు ఇవ్వలేదో అడగండి. ప్రధానమంత్రి ఏ ఒక్క మతానికి అన్యాయం చేయకూడదు కదా..?
* రాజ్‌దీప్: మీరు మైనారిటీల గురించి చెబుతున్నారు.. రంజాన్ సమయంలో ఉద్యోగులను గంటన్నర ముందు ఇంటికి పంపిస్తూ వారిని బుజ్జగిస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.
* రేవంత్ రెడ్డి: ప్రతి మత విశ్వాసాన్ని మేం గౌరవిస్తున్నాం. మనం దసరా, నవరాత్రి జరుపుకోవడం లేదా..? తిరుపతి వెళ్లే వారికి రాయితీలు ఇస్తున్నాం. ఈ దేశంలో ఉన్న ప్రతి మతంలోని వ్యక్తి విశ్వాసాలను మనం గౌరవించాలి.
* రాజ్‌దీప్: హిందువులు, ముస్లింలు…
* రేవంత్ రెడ్డి: హిందూ, ముస్లిం, క్రైస్తవం ఎవరివైనా…? 200 ఏళ్లకుపైగా పాలించిన బ్రిటిషర్లు వెళ్లిపోయిన తర్వాత ఆంగ్లో ఇండియన్లకు పార్లమెంట్, అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఇచ్చాం…
* ప్రీతి: డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది పార్టీలు ఏకమవుతాయంటున్నారు.. త్రి భాషా విధానంపై….
* రేవంత్ రెడ్డి: వాస్తవానికి దక్షిణాది పార్టీలే కాదు మొత్తం దక్షిణాది ప్రజలు…బీజేపీ మాతో లేదు.. ఏ భాషా నేర్చుకోమని జబర్దస్ చేయాల్సిన అవసరం లేదు. కాలేజీల్లో మనం ఫ్రెంచ్, జర్మన్, సంస్కృతం నేర్చుకుంటాం.. హిందీ అధికార భాష కాదు.. ఎక్కువ మంది మాట్లాడే భాష.. తర్వాత తెలుగు, బెంగాలీ. ఎక్కువ మంది మాట్లాడతారు. హిందీ కోసం మోదీ, అమిత్ షా ఎందుకు పట్టుపడుతున్నారు. హిందీని పట్టుకొని తెలుగు, బెంగాలీని ఎందుకు వదిలేస్తున్నారు.. హిందీ ఆప్షనల్‌గా ఉంటే మాకు ఇబ్బంది లేదు.. నేను ఇప్పుడు హిందీలోనే మాట్లాడుతున్నా.. కానీ మమ్మల్ని ఎక్కువగా కొట్టాలని చూడొద్దు… మేం దానికి వ్యతిరేకం… బిజినెస్, ఉద్యోగం కోసం ఇంగ్లిష్ నేర్చుకుంటున్నాం.. ఇది మన మాతృ భాష కాదు..
* రాజ్‌దీప్ సర్దేశాయ్: మీరు ప్రమాదంలో ఉన్నారు. దేశంలో కేవలం ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు.. మీరు హర్యానా, మహారాష్ట్ర ఓడిపోయారు. తెలంగాణను తప్పించి మిగతా చోట్ల ఓడిపోతున్నారు. మీరు ఎందుకు ఎన్నికల్లో ఓడిపోతున్నారు..? వారు ఎందుకు వరుసగా గెలుస్తున్నారు..
* రేవంత్ రెడ్డి: మాకు అనుబంధ సంస్థలుగా యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, విద్యార్థి కాంగ్రెస్ ఉన్నాయి. బీజేపీకి అనుబంధ సంస్థలుగా ఈడీ, సీబీఐ, ఐటీ ఉన్నాయి.. వారు నైస్ ఆర్ ఐస్‌తో పోరాడుతున్నారు.. నైస్ అంటే నార్కొటిక్స్, ఇన్‌కంటాక్స్ బ్యూరో, సీబీఐ, ఐడీ… ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి బీజేపీవారి నుంచి నైస్ కావాలా. ఐస్ కావాలా అని ఫోన్ వస్తుంది. నైస్ వస్తే జైలుకు పోతారు. ఐస్ వస్తే బీజేపీ టిక్కెట్ వస్తుంది…
* రాజ్‌దీప్: మీరు తెలంగాణలో గెలిచి మిగతా చోట ఎందుకు గెలవడం లేదు..?
* రేవంత్ రెడ్డి: అత్యంత ప్రజాస్వామ్యయుతంగా, ఉదారంగా ఉండడమే మా బలహీనత..50 ఏళ్లు రాజ్యసభ సభ్యులుగా ఉన్నవాళ్ళు కూడా తర్వాత టికెట్ ఇవ్వకపోతే మా నేతలు జంతర్‌మంతర్ లో ధర్నా చేస్తారు. మీరు ఇంటర్వ్యూలు చేస్తారు.. బీజేపీలో అద్వానీ, మనోహర్‌జోషి వంటి పెద్ద నేతలను పక్కనపెట్టిన ఒక్కరూ మాట్లాడరు…
* ప్రీతి: ప్రమాదంలో ఉన్న ముగ్గురిలో ఒకరని రాజ్‌దీప్ సర్దేశాయ్ చెప్పారు.. మీరు ప్రధానమంత్రితో సన్నిహితంగా ఉన్నందున పార్టీ అగ్రనాయకత్వం గుర్రుగా ఉందంటున్నారు…
* రేవంత్ రెడ్డి: పార్టీ వేరు.. ప్రభుత్వం వేరు… ప్రభుత్వాలు కలిపి పని చేస్తాయి… ముఖ్యమంత్రిగా నేను ప్రధానమంత్రిని గౌరవిస్తా.. నేను పార్టీ వేదికపై పార్టీ విషయాలు మాట్లాడతా…
* రాజ్‌దీప్: మీ రాష్ట్రంలో స్కిల్ యూనిర్సిటీకి గౌతం అదానీ రూ.వంద కోట్లు ఆఫర్ చేస్తే మీరు తిరస్కరించారు. మీ పార్టీ అగ్ర నాయకత్వం, రాహుల్ గాంధీ వ్యతిరేకించారా..?
* రేవంత్ రెడ్డి: పార్టీ వ్యతిరేకించలేదు.. మా ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకించాయి.. ప్రజలకు కోసం రూ. 100 కోట్లను తేవాలనుకున్నా. బీజేపీ అదానీ నుంచి తీసుకున్న బాండ్లను ఎందుకు వెనక్కి ఇవ్వలేదు… నేను వెనక్కి ఇచ్చా.. నేను ఎటువంటి అపవాదు ఎదుర్కొదల్చుకోలేదు..
రాజ్‌దీప్: మీరు మహా కుంభ్‌మేళా వెళ్లలేదా..?
* రేవంత్ రెడ్డి: మా కుటుంబం వెళ్లింది. నేను భద్రాచలం రావాలని మోదీ, అమిత్ షాను ఆహ్వానించినా రాలేదు. మా గ్రామంలోనూ రామ మందిరం ఉంది.. భద్రాచలం పరమ పవిత్ర క్షేత్రమని నేను నమ్ముతా.. అయినా మోదీ, అమిత్ రావడం లేదు. (నవ్వులు)
* ప్రీతి: రాహుల్ గాంధీ కుంభ్‌మేళా వెళ్లాలని మీరు అనుకోలేదా…
* రేవంత్ రెడ్డి: అవకాశం దొరికిందాన్ని బట్టి ఉంటుంది.. రాజ్‌దీప్ మీరు వెళ్లారా…?
రాజ్‌దీప్: నేను 2008లో వెళ్లా..
* రేవంత్ రెడ్డి: అంటే, ఇప్పుడు వెళ్లలేదా..?
* రాజ్‌దీప్: ఈసారి వెళ్లలేదు…
* రేవంత్ రెడ్డి: ప్రీతి మీరు వెళ్లారా..?
* ప్రీతి: నేను రాజకీయాల్లో లేను.. నేను రాజకీయవేత్తను కాను…
* రేవంత్ రెడ్డి: మీరు, నేను (రాజకీయ నేతలు, జర్నలిస్టులు) ప్రజా జీవితంలోనే ఉన్నాం..
* రాజ్‌దీప్: రేపు క్రీడా శాఖ మంత్రి హైదరాబాద్ వస్తున్నారు. వచ్చే ఒలింపిక్స్‌కు అహ్మదాబాద్ కన్నా హైదరాబాద్ మిన్న అని మీరు చెబుతారా…
* రేవంత్ రెడ్డి: నేను ఇప్పటికే క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు వినతిప్రతం ఇచ్చా.. హైదరాబాద్ ఇప్పటికే మిలటరీ గేమ్స్, నేషనల్ గేమ్స్, ఆఫ్రో-ఏషియన్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. నిఖత్ జరీన్, సానియా మీర్జా, పి.వి.సింధు సహా ఒలింపిక్స్, క్రికెట్‌లో రాణించిన వారంతా తెలంగాణ నుంచి వచ్చారు… అహ్మదాబాద్ కన్నా మా దగ్గర వంద రెట్లు ఎక్కువగా వసతులున్నాయి. మీరు నిజ నిర్ధారణ బృందం పంపండి.. అహ్మదాబాద్, హైదరాబాద్‌ల్లో ఏమేం వసతులున్నాయో తేల్చండి.. ఒలింపిక్స్ గేమ్స్ హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వాలని మేం ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రపంచ సుందరి పోటీలు మేలో హైదరాబాద్‌లో జరగబోతున్నాయి. ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు ఎందుకు ఒలింపిక్స్ జరగకూడదు.
* రాజ్ దీప్: అహ్మదాబాద్.. హైదరాబాద్ ఏదో తేల్చుకోవాలని ఒలింపిక్స్ ప్రతినిధులకు రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు..?.
* రేవంత్ రెడ్డి: అహ్మదాబాద్ కు నరేంద్ర మోదీ బ్రాండ్ అంబాసిడర్… హైదరాబాద్ బ్రాండ్‌ను రేవంత్ రెడ్డి ఎక్కడికి తీసుకెళతారో చూడండి…