హైదరాబాద్ లో ఎకరం ధర 177 కోట్లు

హైదరాబాద్ లో భూముల ధరల్లో సరికొత్త రికార్డు నమోదైంది. రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందంటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్న సమయంలో ఎకరం ధర ఏకంగా 177 కోట్ల రూపాయలు పలికింది. రాయదుర్గం లో 7.67 ఎకరాల భూమి హాట్ కేక్ లా అమ్ముడుపోయింది. దీని ద్వారా టీజీఐఐసీ ఖాతాలో 1357 .59 కోట్ల రూపాయలు జమకానున్నాయి. 2022 లో నియో పోలీస్ కోకాపేట దగ్గర ఎకరం 100 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ సారి 177 కోట్లు పలకడం ద్వారా ఈ రికార్డు బద్దలైంది. ఈ ధర తో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు గా భావించాలి.