రేవంత్ రెడ్డి ధూం ధాం ..హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ భూమ్..
1 min readహైదరాబాద్ లో గత ఆరునెలల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గణనీయమైన వ్రుద్ది కనిపించింది. గత కొంతకాలంలో పలు అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో తాజాగా ప్రముఖ సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపార వ్రుద్ది బాగుందని నివేదికలు ఇవ్వడం గమనార్హం. అంతేకాకుండా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ -సెప్టెంబరు మధ్య కాలం కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబరు మధ్యకాలంలో ఎక్కువ వ్రుద్ది రేటు, ఆదాయం ఉన్నట్లు ఆ సంస్థలు తేల్చాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్- సెప్టెంబర్ మధ్యకాలంలో హైదరాబాద్ లో ఇళ్ల ధరలు పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్షల్టెన్నీ సంస్థ అన్ రాక్ వెల్లడించింది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లోని డేటాను ఇందుకోసం విశ్లేషించింది.
ఆ రిపోర్ట్ ప్రకారం ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో ఇళ్ల సగటు ధర 1.23కోట్లకు చేరింది. అంటే అంతకుముందు 2023-24 మద్యకాలంతో పోల్చితే దాదాపు 23శాతం పెరిగింది. ఇక ఇళ్ల సేల్స్ విషయానికి వస్తే.. 2024 ఏప్రిల్-సెప్టెంబరు మధ్య కాలంలో హైదరాబాద్, చెన్నై, పూణె, కోల్ కత, ధిల్లీ, ముంబై నగరాల్లో 2లక్షల 72వేల 309కోట్ల విలువైన 2లక్షల 27వేల 400 ఫ్లాట్లు, ఇళ్లు సేల్ అయ్యాయి. అంతకుముందుతో పోల్చితే సేల్స్ 3శాతం తగ్గినా అమ్మకాల విలువ మాత్రం 18శాతం పెరిగింది. హైదరాబాద్ విషయానికి వస్తే.. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో జరిగిన ఇళ్ల విక్రయాల సంఖ్య 27,820 గా ఉండగా.. దీని విలువ రూ. 31,993 కోట్లుగా ఉంది. అంతకుముందు ఇదే కాలంలో జరిగిన విక్రయాల విలువ 25059కోట్లు మాత్రమే. అదే సమయంలో ఇళ్ల సగటు ధర 84లక్షలనుంచి 1.15కోట్లకు పెరిగింది. అంటే ధరలు 37శాతం పెరిగాయని ఆ సంస్థ వెల్లడించింది.
ఇక రిజిస్ట్రేషన్ల విషయానికి వస్తే.. 2023అక్టోబరుతో పోల్చితే ఈ ఏడాది రిజిస్ట్రేషన్లు స్వల్పంగా పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తన రిపోర్ట్స్ లో వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలో గత మూడేళ్ల కాలంతో పోల్చితే 2024 జనవరినుంచి పెరిగాయని తేల్చింది. 2022లో 56046 రిజిస్ట్రేషన్లు ఉండగా, 2023లో 58390 రిజిస్ట్రేషన్లు జరిగాయని, 2024లో 65280 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్ల విలువలోనూ 14శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. 2023లో ప్రభుత్వ వద్ద నమోదైన ఆస్తుల విలువ 3,175కాగా, ఈ ఏడాది అంటే 2024లో వాటి విలువ 3617కోట్లుగా చెప్పింది నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక.
అయితే అందులో 50లక్షలలోపు ఉన్నవాటి విలువ తగ్గిందని, అదే సమయంలో 50లక్షలనుంచి కోటి వరకు ఉన్న ఇళ్ల విలువ 17శాతం వ్రుద్ది నమోదైందని తేల్చింది. కోటికంటే ఎక్కువ ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లలో 36శాతం గ్రోత్ ఉందని చెప్పింది. అన్నిటింకంటే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఈ గ్రోత్ 48శాతం ఉందని, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా 41శాతం, హైదరాబాద్ లో 16శాతం గ్రోత్ ఉందని తేల్చింది. ఫ్లాట్ల విషయంలోనూ కొనుగోలుదారుల అభిరుచి మారిందని, అత్యధిక మంది త్రిబుల్ బెడ్ రూం కొనుగోలుచేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని తేల్చింది. మొత్తంమీద సమీప కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పురోగతి గణనీయంగా ఉంటుందని ఆ నివేదికలను బట్టి అర్థం అవుతోంది.