బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కు గుండెపోటు
1 min read
తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ గారు తెలిపారు. వ్యక్తిగత పనులతో తాను డెహ్రాడున్ కు ఆదివారం వెళ్లానని, స్వల్ప గుండె నొప్పి రావడంతో వెంటనే అక్కడే ఆసుపత్రికి వెళ్లానని ఆయన తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించి, స్టంట్ వేసి డిశ్చార్జ్ చేశారని తెలిపారు. తాను పూర్తిగా కోలునున్నానని, ఆరోగ్యంగా ఉన్నానని పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. తన ఆరోగ్యం పట్ల అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందరాదని సూచించారు. తన కార్యకలాపాలన్నీ తిరిగి యధాతధంగా నిర్వహిస్తానన్నారు.