సిట్ ముందుకు హరీష్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు సిట్ ముందు హారజయ్యారు. విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులకు ఆయనకు నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని సిట్ కార్యాలయంలో హరీష్ రావు ను విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావు పాత్ర పైన అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. సిద్దిపేట కు చెందిన పలు పార్టీల నాయకుల ఫోన్లు ట్యాప్ అయినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. వారి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా హరీష్ రావును విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
