హరీష్ రావుకు పితృవియోగం

మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ అనారోగ్యంతో మరణించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన మంగళవారం తెల్లవారుజూమున కన్నుమూశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు హరీష్ రావుకు సంతాపం తెలిపారు.
