కేటీఆర్ అరెస్ట్ ఖాయమేనా..?

మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతించారు. ఈ మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. కేటీఆర్ విచారణ పైన ఏసీబీ అధికారులకు మార్గం సుగమం అయింది. ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్న కేటీఆర్ ను ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రాసిక్యూషన్ కు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల క్రితం గవర్నర్ కు లేఖ రాసింది. అయితే దీనిపైన ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో ఉంచారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ప్రాసిక్యూషన్ కు అనుమితిస్తు నిర్ణయం తీసుకున్నారు.
మరో వైపు ఫార్ములా ఈ రేస్ కారు కేసులో ఏ 2 గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ పైన చర్యల కోసం డీవోపీటీ కి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం డీవోపీటీ నుంచి ఇంకా రాలేదు. దీనిపై స్పష్టత వచ్చాక ఏసీబీ అధికారులు ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది.
ఈ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏసీబీ అధికారులు దూకుడును పెంచే అవకాశం ఉంది. కొత్త సంవత్సర వేడుకలు కేటీఆర్ జైలు జరుపుకునే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆ అరెస్ట్ చేయమని నేతలు స్పష్టం చేస్తున్నారు.
