మూసీకి గోదావరి జలాలు

మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్​ సాగర్​, హిమాయత్ సాగర్ చెర్వులను మంచినీటితో నింపేందకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ – II & III పథకానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రేపు శంకుస్థాపన చేస్తారు.

రూ.7360 కోట్లతో ప్రభుత్వం హమ్ విధానంలో ఈ ప్రాజెక్టును చేపడుతుంది. ఇందులో ప్రభుత్వం 40 శాతం పెట్టుబడి వాటా పెట్టనుండగా, కాంట్రాక్ట్ కంపెనీ 60 శాతం నిధులు సమకూరుస్తుంది.

రెండేండ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తారు. అందులో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నింపి మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీలు కేటాయిస్తారు.

మిగతా 17.50 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మార్గమధ్యలో ఉన్న 7 చెర్వులను నింపుతారు.

డిసెంబర్ 2027 నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు, ప్రతి రోజు నల్లా నీటిని సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టును లక్ష్యంగా ఎంచుకున్నారు.

2

ఓఆర్ఆర్ – ఫేజ్ II లొ భాగంగా జిహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు మరియు గ్రామ పంచాయితీలకు తాగునీటి సరఫరా చేపట్టిన ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

రూ.1200 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 71 రిజర్వాయర్లు నిర్మించారు.

వీటిలో కొత్తగా ఇటీవల నిర్మించిన 15 రిజర్వాయర్లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, కీసర, రాజేంద్రనగర్, షామీర్‌పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఆర్‌సీ పూరం, పటాన్‌చెరు, బొలారం.. మొత్తం 14 మండలాల్లోని 25 లక్షల మందికి తాగునీరు అందుతుంది.

3

కోకాపేట్ లేఅవుట్ సమగ్ర అభివృద్ధి – నియో పోలీస్- సెజ్ కు తాగునీటితో పాటు మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేసే రూ.298 కోట్ల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.

రెండేండ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుతో 13 లక్షల మంది లబ్ధి పొందుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn