కేటీఆర్ కు పొంగులేటి విందు
1 min readరాగిసంకటి… ముద్దపప్పు…పచ్చిపులుసు…కుండ పెరుగు… బొమిడాల పులుసు…మటన్ కీమా… ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే ముఫ్ఫైకి పైగా వెరైటీ వంటకాలతో పొంగులేటి ఇంట కేటీఆర్‌కు అతిథ్యాన్ని ఇచ్చారు. కేటీఆర్ ఖమ్మం నగర పర్యటన సందర్భంగా ఈ మధ్యాహ్న విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. దీనిని స్వీకరించిన కేటీఆర్ ఆహా ఏమి రుచి శీనన్న అంటూ ఆ విందు భోజనాన్ని ఆరగించారు. వంటకాలన్ని బాగున్నాయంటూ పొంగులేటిని పొగడ్తలతో ముంచెత్తారు. వంటకాలే కాదు..పొంగులేటి అతిథ్యాన్ని గమనించిన కేటీఆర్ ఖుషీ అయ్యారు. తన అభిప్రాయాన్ని ఇతర ప్రజాప్రతినిధులతో సైతం పంచుకున్నారు.
-మ్యాంగో బాహు బాగు…!
సుమారు 200ఏళ్ల క్రితం నాటి చెట్టుకు పండిన మామిడి పండును కేటీఆర్‌కు విందు భోజనం అనంతరం ఇచ్చారు. దానిని తిన్నాక ‘మ్యాంగో బాహు బాగు’ అంటూ సంతృప్తి వ్యక్తం చేశారు.
-మెమోంటోతో కేటీఆర్‌కు పొంగులేటి దంపతుల సత్కారం పొంగులేటి ఇంట కేటీఆర్ కు విందు భోజనం అని సమాచారం అందుకున్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలొచ్చారు. ఆయన అతిథ్యాన్ని వీరు కూడా స్వీకరించారు.